కెసిఆర్‌కు వ్యతిరేకంగా మహకూటమి, పవన్ దారెటు?

తెలంగాణలో మహకూటమిని ఏర్పాటు చేసేందుకు విపక్షాలు రంగం సిద్దం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను ఓడించేందుకు విపక్షాలు ఏకతాటిపైకి రావాలని భావిస్తున్నాయి. అయితే విపక్షాలన్నీ ఈ కూటమిలో చేరుతాయా, లేదా అనే దానిపై స్పష్టత రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.మరో వైపు ఈ కూటమిలో ఏఏ పార్టీలు చేరుతాయనే దానిపై స్పష్టత రావడానికి సమయం పట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2019 ఎన్నికల్లో టిఆర్ఎస్‌కు వ్యతిరేకంగా విపక్షాలు కూటమిగా ఏర్పడాలనే అభిప్రాయంతో ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలు కూటమిగా పోటీచేసిన సందర్భాలున్నాయి. అయితే అదే తరహ ప్రయోగాన్ని ఈ తరహ కూడ అమలు చేయాలని విపక్షాలు భావిస్తున్నాయి అయితే ఈ కూటమి ఏర్పాటుపై మరికొన్ని రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కెసిఆర్‌కు వ్యతిరేకంగా మహకూటమిని ఏర్పాటు చేయాలని తెలంగాణలో విపక్ష పార్టీల నేతలు కొందరు కసరత్తు చేస్తున్నారు అయితే ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పాలక పార్టీలకు వ్యతిరేకంగా విపక్షాలు కలిసి పోటీ చేసినట్టుగానే 2019 ఎన్నికల్లో కూడ కూటమిని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. ఈ కూటమిలో సిపిఐ, టిడిపి, కాంగ్రెస్, టిజెఎసి, సిపిఎం పార్టీలు ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటికే కొందరు నేతలు కూటమి ఏర్పాటుపై ఇతర పార్టీల నేతలతో చర్చించినట్టు సమాచారం. మరోవైపు ఈ కూటమిలో ఎవరెవరు ఉంటారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

2019 ఎన్నికల సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కూటమిని ఏర్పాటు చేయాలని విపక్ష పార్టీలకు చెందిన కొందరు నేతలు ప్రతిపాదిస్తున్నారు. విడివిడిగా పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి టిఆర్ఎస్‌కు ప్రయోజనం కలుగుతోందని అభిప్రాయపడ్డారు.దీంతో టిఆర్ఎస్‌ను ఓడించాలంటే కూటమిగా పోటీ చేయాలనే ప్రతిపాదిస్తున్నారు. కాంగ్రెస్ ఈ కూటమిలో చేరితే టిడిపి కూటమిలో కలుస్తోందా అనే చర్చ కూడ లేకపోలేదు.

తెలంగాణలో మహకూటమిలో సిపిఎం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి. సిపిఎం ఇటీవలనే బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణలోని అన్ని స్థానాలకు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పోటీ చేయనున్నట్టు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ఈ కారణంగానే మహకూటమి ఏర్పాటైతేన సిపిఎం ఈ కూటమిలో చేరకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2019 ఎన్నికల్లో టిడిపి పయమనమెటనేది కూడ చర్చనీయాంశంగా మారింది మహకూటమి ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ మహకూటమిలో ఉంటే టిడిపి ఆ కూటమిలో ఉంటుందా ఉండదా అనేది ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూటములుగా పోటీ చేసిన సమయంలో కాంగ్రెస్‌, టిడిపిలు ఒకే కూటమిలో లేవు. కానీ, ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మారాయి. ఈ తరుణంలో టిడిపి ఏ రకంగా వ్యవహరిస్తోందనేది చూడాలంటున్నారు విశ్లేషకులు.

తెలంగాణ సీఎం పాలనను ప్రశంసలతో పవన్ కళ్యాణ్ ముంచెత్తారు. అయితే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏ పార్టీలతోనైనా పొత్తు పెట్టుకొంటారా, ఒంటరిగా పోటీ చేస్తారా అనేది కూడ కీలకంగా మారనుంది. పొత్తులు పెట్టుకొంటే పవన్ కళ్యాణ్ ఏ పార్టీలతో పొత్తు పెట్టుకొంటారు, విపక్షాలతో పవన్ కలిసి వెళ్తారా, టిఆర్ఎస్‌తో ముందుకు సాగుతారా అనేది ఇప్ప.టికిప్పుడే చెప్పలేం. అయితే పవన్ కళ్యాణ్‌తో ఇప్పటికే సిపిఎం, సిపిఐ రాష్ట్రాలకు చెందిన నేతలు కూడ చర్చించారు.

తెలంగాణ జెఎసి ఛైర్మెన్ కోదండరామ్‌తో కూడ విపక్ష పార్టీలకు చెందిన నేతలు కూడ చర్చించినట్టు సమాచారం . అయితే ఈ కూటమి ఏర్పాటుపై కొన్ని పార్టీలు సానుకూలంగా ఉన్నాయనే సమాచారం. మరో వైపు కూటమి ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడే చొరవ చూపేందుకు ఇష్టపడడం లేదని సమాచారం. ఇతర పార్టీల నుండి ప్రతిపాదన వస్తే ఈ విషయమై చర్చించేందుకు సిద్దంగా ఉందని తెలుస్తోంది. కూటమిగా పోటీ చేస్తే సీట్ల సర్ధుబాటు విషయమై తలనొప్పులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ కొంత వెనుకడుగు వేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. #KhabarLive