బడ్జెట్…లెదర్ బ్యాగ్ లోనే ఎందుకు తెస్తారు?

‘బడ్జెట్’ ప్రస్తుతం అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. ఈ ఏడాది బడ్జెట్ కారణంగా ఎవరి ప్రయోజనం జరగనుంది..? పేద, మధ్య తరగతి ప్రజల కష్టాలు తీర్చేలా ఉంటుందా లేదా.. అనే దానిపైనే అందరి దృష్టి ఉంది. ఎందుకంటే.. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.. బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు.

బడ్జెట్ అనగానే అందరికీ గుర్తుకువచ్చేది.. ఆర్థిక శాఖ మంత్రి ఓ సూట్ కేసు పట్టుకొని పార్లమెంట్ లోకి అడుగుపెట్టేది. అసలు బడ్జెట్ ప్రతులను ఆ సూట్ కేసులోనే ఎందుకు తీసుకువస్తారు..? బడ్జెట్ కి ఆ లెదర్ సూట్ కేసుకి ఉన్న సంబంధం ఏంటి..? ఇలాంటి సందేహాలు చాలా మందికి వచ్చే ఉంటాయి. ఆ సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దామా..

బడ్జెట్ ను ఫ్రెంచ్ భాషలో బోగెటి అంటారు. ఇంగ్లీషులో దీని అర్థం లెదర్ బ్యాగ్. 1860లో బ్రిటన్ మొదటి ఆర్థిక మంత్రి విలియం ఎవర్ట్ గ్లాడ్ స్టోన్ మొదట లెదర్ బ్యాగ్ లో బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలా ఆయనతో మొదలైన సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.

బ్రిటీష్ వారు ప్రారంభించిన ఈ సాంప్రదాయన్ని స్వాంత్రంత్యం తర్వాత కూడా మన వాళ్లు కొనసాగిస్తూ రావడం విశేషం. సాదారణ లెదర్ బ్యాగ్ గే కదా.. అని తీసిపారేయలేం.. ఎందుకంటే.. ఒక దేశ ఆర్థిక వ్యవస్థని నడిపిచే శక్తి ఆ బ్యాగ్ లో ఉంది. అందుకే.. దానిని ఆర్థిక శాఖ మంత్రి జాగ్రత్తగా తీసుకువస్తుంటారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటగా మన దేశంలో బడ్జెట్ ని లెదర్ బ్యాగ్ లో తీసుకువచ్చింది.. బడ్జెట్ బ్యాగ్ సంప్రదాయం మొదట ఆర్కే షణ్ముఖం. బడ్జెట్ ఫోటోగ్రాఫ్ కూడా ఈయనే ప్రారంభించారు. ఆయన ప్రవేశపెట్టిన అదే సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు ఆర్థికమంత్రులు.

బడ్డెట్ ని బ్రీఫ్ కేస్ లో తెచ్చే సాంప్రదాయం మారకపోయినా బ్రీఫ్ కేస్ రంగులు మాత్రం మారాయి. 1998-99 బడ్జెట్ సమయంలో ఫైనాన్స్ మినిస్టర్ యశ్వంత్ సిన్హా నలుపు రంగుల్లో లెదర్ బ్యాగ్‌లు తీసుకొచ్చారు.

అదే సంప్రదాయాన్ని ఎంతో కీలకమైన ఆర్థిక సంస్కరణల సమయమైన 1991వ సంవత్సరంతో మన్మోహన్ సింగ్ సైతం కొనసాగించారు. అయితే యూపీఏ హయంలో అప్పటి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ మాత్రం బ్రిటీష్‌ వారిలా బ్లాక్ రంగు బ్యాగ్ కు బదులు రెడ్ కలర్ బాక్స్ లో బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చారు.

తర్వాత ప్రతి ఏటా ఆర్థికమంత్రి బడ్జెట్ పేపర్లు తీసుకొచ్చే ఈ బ్యాగ్ రంగుల్లోనూ, రూపురేఖల్లోనూ తేడా కనిపిస్తూ వస్తోంది. ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలు స్వీకరించినప్పుడు మొదటి రెండు సంవత్సరాలు బ్లాక్, ట్యాన్ రంగుల్లో బ్యాగ్ ను వాడారు. బడ్జెట్ బాక్స్ ను మాత్రం ఆర్థికమంత్రిత్వ శాఖే సేకరిస్తోంది. నాలుగు రంగుల్లో బ్యాగులను ఆర్థికమంత్రి ముందు ఉంచుతుంది. వాటిలో తనకు నచ్చిన రంగును ఆర్థికమంత్రి ఎంచుకుంటారు. అయితే ఈ సారి అరుణ్ జైట్లీ ఏ రంగు బ్యాగులో బడ్జెట్ పత్రాలు తీసుకు వస్తారో చూద్దాం. #KhabarLive