తెలంగాణ సిఎం కేసిఆర్ చట్టాన్ని ’48 గంటల్లోనే’ ధిక్కరించిన కాంగ్రెస్ శ్రవన్ ఫైర్

తెలంగాణ సిఎం కేసిఆర్ పై కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవన్ ఫైర్ అయ్యారు. పరుష పదజాలంతో ధూశిస్తే కేసులు పెట్టి జైలు పాలు చేస్తామని హెచ్చరించే చట్ట సవరణ ఫైలుపై సిఎం కేసిఆర్ సంతకం చేసిన 48 గంటల్లోనే దాసోజు శ్రవన్ ధిక్కరించారు. కేసిఆర్ ను తుగ్లక్ అంటూ నింధించారు శ్రవన్. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసిఆర్ తిట్టిన మాటల వీడియోలను ఈ సందర్భంగా దాసోజు గాంధీభవన్ లో ప్రదర్శించారు.

సోషల్ మీడియా ను కేసీఆర్ నియంత్రించాలని చూస్తున్నారు. సోషల్ మీడియా లో పోస్టింగ్ లపై నాన్ బెయిల్ కేసులు పెట్టాలని కేసీఆర్ చూస్తున్నారు .. దీన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నది. 506 ,507 సెక్షన్ లు మార్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ సెక్షన్ లను మార్చే హక్కు లేదని గతంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి.

తలకుమాసిన లీగల్ అడ్వైజర్ ఆలోచనలను కేసీఆర్ ఫాలో అవుతున్నారు. కేసీఆర్ కు మళ్లి న్యాయస్తానంలో చివాట్లు తప్పవు. ఇది కేసీఆర్ దురహంకార,అణిచివేత చర్యకు నిదర్శనం. తెలంగాణ ఏర్పాటు ,నిర్భయ చట్టం. ప్రస్తుతం రాష్ట్రం లో అనేక అక్రమాలు బయటికి రావడంలో సోషల్ మీడియా పాత్రే ఎంతో ఉంది.

మీడియాను సక్సెస్ ఫుల్ గా నియంత్రిస్తున్న కేసీఆర్ సోషల్ మీడియాను అణిచివేస్తే తిరుగుండదు అనుకుంటున్నారు. కేసీఆర్ కు సోయి ఉంటే ..మహిళలను కించపరిచే విధంగా సినిమాలు తెస్తున్నవారి పై చర్యలు తీసుకోవాలి. ధర్నా చౌక్ ను ఎత్తేస్తే ..ప్రజలు ఎలా తమ భాధలు చెప్పుకోవాలి? షోషల్ మీడియాలో నిజాలు చెబుతాం. దమ్ముంటే కేసులు పెట్టుకో. పేదోడికి సోషల్ మీడియా పాశుపతాస్త్రం. సోషల్ మీడియాపై ఆంక్షలు పెట్టి పేదోడి గొంతు నొక్కాలని కేసీఆర్ చూస్తున్నారు. దూషిస్తే దండన అయితే కేసీఆర్ పై కేసులు పెట్టాలంటే ఐపీసీ సెక్షన్ లు సరిపోవు.

ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన ఆర్టీసీ కార్మికుడు సంజయ్ పై అక్రమకేసులు పెట్టి వేధిస్తున్నారు. 506,507 ను మార్చాలనుకుంటున్న ప్రభుత్వంపై కోర్టు కెళతాం. #KhabarLive